logo

'రాజస్థాన్, మధ్యప్రదేశ్'లకు రెడ్ అలెర్ట్


15-Aug-2019 15:24IST
maharastra rajasthan states has red alert

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వర్ష భీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించగా కేరళలోని మళప్పురం, కొజికడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతూనే ఉంది. వచ్చే రెండురోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు భారీ వరదలు కారణంగా మహారాష్ట్రలోని ముంబై, పూణే డివిజన్ లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags: maharastra rajasthan red alert

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top