logo

గాయం కారణంగా తొలి టెస్టు కు కోహ్లీ దూరం..?


15-Aug-2019 18:29IST
can kohli play first test

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు. విండీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. కాగా ప్రాథమిక చికిత్స అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన కోహ్లి కెరీర్ లో 43వ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు.అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ గాయానికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని, గాయం చిన్నపాటిదేనని డాక్టర్లు స్పష్టం చేసారు. కానీ కోహ్లీ కొంత అసౌకర్యంగా కనిపించడంతో వేలికి ఫ్రాక్చర్ అయ్యిందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విండీస్‌తో జరగబోయే తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ అంశంపై స్పందించిన కోహ్లి తన వేలికి గాయమైన విషయం వాస్తవమేనని, కాకపోతే అది అంత తీవ్రమైనది కాదని స్పష్టం చేసారు. కానీ గాయం అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ నొప్పి వల్ల కొంత అసౌకర్యంగా కన్పించడం, గాయాన్ని దాస్తున్నాడేమో అన్న అనుమానాలకు తావిస్తుంది. 

Tags: virat kohli windies testmatch

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top