logo

భారీగా దిగొచ్చిన పసిడి ధర..!


15-Aug-2019 19:49IST
hugely reduced gold price

గత కొద్దీ రోజుల నుండి బంగారం ధర అడ్డుఅదుపు లేకుండా భారీగా పెరుగుతూ.. వచ్చింది. కానీ, నేడు ఆ జోరుకి కళ్లెం పడింది. దాంతో బంగారం ధర డగొస్తే.. వెండి ధర మాత్రం అక్కడే ఉంది. వివరాల్లోకెళితే...హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పడిపోయింది. అంతర్జాతీయంగా బలమైనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మరింత అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.47,265 వద్ద నిలకడగా కొనసాగుతోంది. 

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది. ఇక మన రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.37,700కు క్షీణించగా...10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 క్షీణతతో రూ.36,500కు తగ్గింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.47,265 వద్ద కొనసాగుతోంది. 

Tags: hugely reduced gold price silver

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top