logo

పేలిన ఇన్నోవా కారు టైరు: ఇద్దరు మృతి


15-Aug-2019 21:06IST
burst Innova car tire two killed

ఇన్నోవా కారు టైరు పేలడంతో వాహనం బోల్తా పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాద్‌లోని ఓల్డ్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా వాహనంలో ముంబయి నుంచి హైదరాబాద్‌కి వస్తోంది. జహీరాబాద్‌ మండలం సత్వార్‌ శివారుకి రాగానే వాహనం ముందు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. దాంతో వాహనంలోని డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌ (27)తో పాటు కారులో ఉన్న అరుణ్ ‌(24) అక్కడికక్కడే మృతి చెందగా.. జయరాం, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సిరాజ్‌పల్లి పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Tags: sangareddy burst Innova car tire

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top