logo

పోలీసులకు సహకరించిన కందిరీగలు


15-Aug-2019 22:12IST
wasps who cooperated with the police

సాధారణంగా కందిరీగలంటే అందరికి భయమే అలాంటిది కందిరీగలు పోలీసులకు జైలు నుండి పారిపోతున్న ఖైదీని పట్టించిన విచిత్రమైన సంఘటన జర్మనీలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...జర్మనీ ఓల్డెన్‌బర్గ్‌లోని ఓ జైలు నుంచి 32 ఏళ్ల ఓ ఖైదీ తప్పించుకున్నాడు. తప్పించుకునే ప్రయత్నంలో జైలు బాల్కనీలోంచి నేరుగా కందిరీగలు ఉన్న తెట్టెపైకి దూకాడు. దీంతో ఆగ్రహానికి గురైన కందిరీగలు అతడ్ని వెంటాడి కుట్టడం ప్రారంభించాయి. నొప్పి తాళలేక అతడు వీధుల్లో పరుగులు పెట్టసాగాడు. అయినప్పటికి అవి అతడ్ని వదలలేదు. ఇక చేసేదేమీ లేక అతడు అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి తలదాచుకున్నాడు. ఖైదీని వెంటాడుతూ వచ్చిన పోలీసులు పూల్‌ దగ్గర అతడ్ని గమనించడంతో ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు కందిరీగలకు ఓ సెల్యూట్ కొట్టారు. 

Tags: wasps cooperated police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top