logo

40 మందికి తప్పిన పెను ప్రమాదం


16-Aug-2019 17:08IST
Missing accident with 40 people in pulikot lake

నెల్లూరు: పడవలో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణానికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నెల్లూరులోని పులికాట్ సరస్సులో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం...బీవీపాలెం నుంచి ఇరకందీవికి వెళ్తున్న పడవలో 40మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా ఈదురు గాలులతో కూడిన అలలు వల్ల ఒక్కసారిగా పడవ అదుపుతప్పడంతో సగం వరకు నీటిలో మునిగింది. దాంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాంతో అలెర్ట్ అయినా స్థానికులు వేరే పడవలో వెళ్లి వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.అనంతరం ఒడ్డుకు చేరిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags: boat accident 40 people pulikot lake

Advertisement
Advertisement
Top