logo

ఓ వ్యాపారి కుటుంబంతో సహా ఆత్మహత్య: కర్ణాటక


16-Aug-2019 20:00IST
Suicide including a merchant family Karnataka

కర్ణాటక: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యాపారి తన దగ్గర ఉన్న తుపాకీతో కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపి, అనంతరం తాను కాల్చుకొని దారుణంగా మృతిచెందిన దుర్ఘటన కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైసూర్ కి చెందిన ఓమ్ ప్రకాశ్, భార్య నికిత దంపతులకు కుమారుడు ఆర్య, తల్లిదండ్రులు నాగరాజు, హేమ రాజులతో సహా మైసూర్ లోనే ఓ వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఓంకార్ ప్రసాద్ కుటుంబంతోసహా ఊరు వదిలి బందిపోరాలోని యేలచెట్టి గ్రామంలో ఉన్న ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. ఇటీవల బంధీపూర్ ఫారెస్ట్ సమీపంలోని యెలశెట్టి గ్రామంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో మాకాం మార్చారు. అయితే గత మూడు రోజుల కిందట గుండ్లుపేట్‌లోని నంది హోటల్‌‌కి వచ్చి అక్కడే ఉంటున్నారు. గురువారం రాత్రి ప్రసాద్ డ్రైవర్‌ను బయటకి పంపేశాడు. అనంతరం గుండ్లుపేట పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న శివారు ప్రాంతానికి ఓం ప్రసాద్ తన కుటుంబాన్ని తీసుకెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుపాకీతో తండ్రి నాగరాజ్, తల్లి హేమలత, భార్య నిఖిత, కుమారుడు ఆర్య కృష్ణ లను కాల్చి చంపాడు. 

తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తుపాకీ శబ్దాలను విన్న స్థానికులు ఘటన స్ధలానికి చేరుకొని స్థానిక పోలీసు ఠాణాకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని చూడగా ఓమ్ ప్రకాశ్ చేత్తోలో తుపాకీ చూసి అతడే అందర్నీ చంపి తాను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చామరాజనగర్ ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. 

Tags: suicide merchant family Karnataka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top