logo

రెండు రోజుల భూటాన్ పర్యటనలో మోడీ


17-Aug-2019 14:43IST
pm modi on two day bhutan tour

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా నేడు భూటాన్ కి చేరుకున్నారు. ప్రధాని మోడీకి భూటాన్ లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పశ్చిమ భూటాన్‌లో గల పారో లోయలోని విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఒక బాలుడు పుష్పగుచ్చాన్ని బహూకరించి సాదర స్వాగతం పలికాడు. చైనా తో సరిహద్దుకు సంబంధించి, భూటాన్ కు భారత్ మద్దతు పలుకుతోంది. ఈ అంశం ఫై భారత వైఖరి పట్ల చైనా కాస్త గుర్రుగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ భూటాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ పర్యటన పై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో విద్య, ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వంటి పలు అంశాలఫై ఇరు దేశ ప్రధానులు చర్చించనున్నారు. అందులో భాగంగా విద్యతో పాటు 10 కీలక ఎంఓయులపై ఇరు దేశ ప్రధానులు సంతకాలు చేయనున్నారు. 

Reached Bhutan a short while ago, marking the start of an important visit. I am extremely grateful to @PMBhutan for welcoming me at the airport. His gesture is deeply touching.

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

Tags: pm modi bhutan tour

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top