logo

ఐస్‌క్రీమ్ కోసం ప్రియున్ని కడతేర్చిన ప్రియురాలు


17-Aug-2019 15:22IST
girlfriend killed her boyfriend for ice cream

సాధారణంగా ప్రేమికులు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుంటారు. కానీ కొంత సమయం తరువాత వారే మళ్ళీ ఎప్పటిలాగే కలసి పోతారు. అంతే కాకుండా వారి మధ్య కోపాలు, భాదలు, పోట్లాటలు లాంటివి ఎన్నో వారి మధ్య ప్రేమను వారికి గుర్తుచేస్తూ ఉంటాయి. అలాంటిది ఓ ప్రియురాలు మాత్రం తన ప్రియుడు చేసిన చిన్న సరదా పనికి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన చైనాలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...చైనాలోని హెసెన్ ప్రాంతానికి చెందినా ఓ ప్రేమ జంట సరదాగా షాప్పింగ్ చెయ్యడం కోసం ఓ మాల్ కి వెళ్లారు. 

షాపింగ్ అనంతరం మాల్ అంతా తిరిగి సరదాగా గడిపారు. అలా తిరుగుతూ అలసిపోయి ఒక ఐస్‌క్రీమ్ పార్లర్ దగ్గరకు వెళ్లి ఐస్‌క్రీమ్ తిన్నారు. కాగా ఆ యువతీ నాకు మరో ఐస్‌క్రీమ్ కావాలని ప్రియున్నిఅడగగా 'ఇప్పటికే చాలా ఐస్‌క్రీమ్స్ తిన్నవు.. ఇంకా తింటే బాగా లావుగా అయిపోతావు'  అంటూ సరదాగా వారించాడు. దాంతో తన శరీరాకృతి గురించి తప్పుగా మాట్లాడినందుకు కోపంతో పక్కనే ఉన్న కత్తితో ప్రియున్ని దారుణంగా పొడిచింది. దాంతో తీవ్ర రక్త స్రావంతో అతడు అక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మాల్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.  

Tags: girlfriend killed boyfriend ice cream china

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top