logo

ఆమె ఖరీదు గొర్రెలేనా..?


18-Aug-2019 16:31IST
Is her cost sheep

ఓ వివాహ దంపతుల మధ్య వ్యాపారపరంగా పంచాయితీ పెద్దలిచ్చిన తీర్పును ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులే తికమక పడుతన్న విచిత్రకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోరఖ్‌పూర్ జిల్లాలోని బైలో అనే గ్రామంలో ఖారోబార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేవాడు. ఈ క్రమంలో ఖారోబార్ భార్యకు అదే గ్రామంలో ఉంటున్న రామ్ నరేశ్
అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 

అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన భర్త స్థానిక పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై కంప్లైంట్ చేశాడు. దాంతో పోలీసులు బాధితుడి భార్యను పిలిచి విచారించగా... ఆమె తన భర్త అంటే తనకి ఇష్టం లేదని, అతని దగ్గుకు వెళ్లనని తేల్చి చెప్పేసింది. దాంతో చేసేదేమి లేక పోలీసులు ఈ సమష్యని గ్రామ పెద్దలకు అప్పగించారు. దాంతో పెద్దలు కొద్దీ రోజుల అనంతరం పంచాయితీ పెట్టారు. ఆ పంచాయితీలో ఖారోబార్ భార్య ప్రియుడు రామ్ తో కలిసి ఉండాలంటే తన దగ్గర ఉన్న గొర్రెల్లో సగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పెద్దలు ప్రశ్నించగా దానికి రామ్ అంగీకరించాడు. అనంతరం రామ్ నరేష్ తన దగ్గర ఉన్న గొర్రెల్లో సగం అంటే 71 గొర్రెలను అతనికి ఇచ్చేయడంతో పంచాయితీ పూర్తి అయింది. 

కానీ, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. భర్తను వదిలేసి లవర్‌తో కలిసి సహజీవనంలో ఉంటున్న వారి జీవితంలోకి రామ్ తండ్రి విలన్ ల ఎంట్రీ ఇచ్చాడు. రామ్ నరేశ్ తండ్రి పోలీసుల దగ్గరకు వెళ్లి తన గొర్రెలను ఖారోబార్ దొంగిలించాడంటూ ఫిర్యాదు చేశాడు. దాంతో కొడుకుని పిలిచి దర్యాప్తు చెయ్యగా ఆమె భర్తకు తానే ఆ గొర్రెలను ఇచ్చినట్లు  రామ్ నరేశ్ సమాధానం ఇచ్చాడు. దాంతో అవి తను సంపాదించిన గొర్రెలని వాటిపై కొడుక్కి ఎటువంటి హక్కులేదని వాదిస్తుంటే కనీసం నాకిచ్చే వాటాలో సగం గొర్రెలనైనా తనకు ఇవ్వాలని కోరాడు. ససేమిరా ఒప్పుకోని అతని తండ్రి పోలీసులను న్యాయం చేయాలంటూ కోరాడు. దీంతో తలలు పట్టుకున్న పోలీసులు ఏం చేయాలో అర్థం కావడం లేదని పై అధికారులను అడిగి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. 

Tags: uttarpradesh 71 sheeps woman

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top