logo

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శలు..!


18-Aug-2019 17:36IST
tdp leader comments on ysrcp government

జగన్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో లంక గ్రామాలు తీవ్ర ముంపుకు గురయ్యాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు, కేవలం చంద్రబాబు నివాసంతో పాటు టీడీపీ నేతల నివాసాల్లో వరదనీరు రావాలన్న దురుద్దేశంతోనే 5 టీఎంసీల నీళ్లు వచ్చేలా గేట్లు ఎత్తివేశారని వారు ఆరోపించారు. చంద్రబాబును అన్నిరకాల ఇబ్బందులకు గురిచేయాలని చెడు ఉద్దేశంతోనే జగన్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యంగా మాజీ సీఎం నివాసంపై ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్ కెమెరాను వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడడం సరికాదన్నారు.

Tags: tdp leader ysrcp government

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top