logo

ఈ తోక అమెరికాకు ఎందుకు వెళ్లలేదు : బుద్ధా


19-Aug-2019 10:41IST
buddha venkanna sensational twit on vijyasai reddy

వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి పై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ప్రతి పర్యటనలో ఉండే తోక అమెరికా ఎందుకు వెళ్లలేదంటూ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు బుద్ధా. ముఖ్యమంత్రి అమెరికా వెళ్తే విజయసాయి రెడ్డి ఎందుకు డుమ్మా కొట్టారంటూ ప్రశ్నించారు. విదేశాలకు వెళ్తే నిమ్మగడ్డ ప్రసాద్ లా నిన్నుకూడా జైల్లో వేస్తారని భయపడ్డారా అంటూ తన ట్విట్టర్ లో ప్రశ్నించారు బుద్ధా.

"జగన్ అమెరికా పర్యటనకు దొంగ లెక్కల మాస్టారు ఎందుకు డుమ్మా కొట్టినట్టు? ప్రతి పర్యటనలో ఉండే తోక అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లలేదు? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు బుద్దా. మరో పోస్టులో విదేశాలకు వెళ్తే నిమ్మగడ్డ ప్రసాద్ లా నిన్ను కూడా జైల్లో వేస్తారు అని భయమా వీసా రెడ్డి గారూ? అన్నట్టు ఒకవేళ జైల్లో వేస్తే ప్రజలకు సేవ చేస్తుంటే జైల్లో వేసారు అని రాయడానికి అక్కడ దొంగ పేపర్, దొంగ ఛానెల్ లేవు గా... అంటూ వెటకారంగా ట్విట్ చేసారు బుద్ధా వెంకన్న. దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

Tags: buddha venkanna vijayasai reddy tdp ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top