logo

మష్రూమ్ సమోసా.. ఇలా చేసుకోవచ్చా..


19-Aug-2019 15:37IST
mushroom samosa easy preparation

మష్రూమ్స్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. న్యాచురల్ గా దొరికే వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇక ఈ మష్రూమ్స్ ను కూరగా చేసుకుంటారు. లేదా సైడ్ డిష్ గా చేసుకుంటారు. అయితే, ఈ మష్రూమ్స్ తో సమోసాలు కూడా చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలి.. మనం ఇంట్లోనే కూర్చొని రెస్టారెంట్ స్టయిల్లో ఎలా చేసుకోవచ్చొ ఇప్పుడు చూద్దాము.. 

కావలసిన పదార్థాలు:

మష్రూమ్స్       : 50గ్రాములు 
గోధుమ పిండి   : పావు కిలో 
ఉప్పు                : సరిపడా 
కారం                 : సరిపడా 
ఆనియన్స్         : ఒకటి
మిర్చి                 : ఒకటి  
కొత్తిమీర             : రెండు రెబ్బలు 
పొటాటో             : ఒకటి 
నూనె                 : డీ ఫ్రై కి 

తయారీ విధానం :

ముందుగా గోధుమ పిండిని తీసుకొని, కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా పిసిగి పక్కన పెట్టుకోవాలి. పొటాటో ను ఉడికించి పక్కనపెట్టుకోవాలి. అలాగే మష్రూమ్స్ ను కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఒక ఫాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. వాటిని గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. అందులో ఉడికించిన మష్రూమ్స్ వేసి కాస్త వేయించాలి. పొటాటో ను బాగా చిమి ఆ మిశ్రమంలో వేసి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి వేయించాలి. తర్వాత సమోసాలాగా చపాతీ పిండిని చేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో ఉంచి సమోసాలను రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మరో ఫాన్ పెట్టుకొని డీ ఫ్రై కి కావలసిన నూనె వేసి, ఈ సమోసాలను అందులో వేసి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే మష్రూమ్ సమోసా రెడీ.. ఈ సమోసాలను టమోటా కెచప్ తో తింటే మరింత రుచిగా ఉంటాయి. చూసారుగా రుచికరమైన మష్రూమ్ సమోసా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి..

Tags: mushroom samosa easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top