logo

అశ్లీల వెబ్‌సైట్లపై ఆగ్రహించిన హైకోర్టు


20-Aug-2019 16:48IST
The High court is outraged over pornographic websites

హైదరాబాద్: యువతను ఆకర్షించేందుకు నేడు చాలా రకాల అశ్లీల వెబ్‌సైట్లు గూగుల్ లో దర్శనమవుతుంటాయి. అలాంటి సైట్ల వల్ల యువత పక్కదారి పట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అశ్లీల వెబ్‌సైట్లపై గూగుల్ ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అనంతరం ఇలాంటి వెబ్‌సైట్లకు సంభందించిన పూర్తి వివరణ తెలియజేయాలంటూ హైకోర్ట్ గూగుల్ కి  ఆదేశాలను జారీ చేసింది. 

ఎవరో అనామకులు తన ఫేస్‌బుక్‌ని హాక్ చేసి అందులో ఉన్నతన పేర్లు, ఫొటోలను సేకరించి వాటిని అనేక రకాలుగా మార్ఫింగ్ చేసి, పోర్న్‌సైట్లలో పెడుతున్నారని ఓ యువతి తీవ్రఆవేదనతో హైకోర్టును ఆశ్రయించింది. అశ్లీల వెబ్‌సైట్ల నుంచి తన పేరు, ఫొటోలను తొలగించాలని గతంలో గూగుల్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ సంస్థ స్పందించకపోవడంతో బాధితురాలు  హై కోర్టు మెట్లెక్కింది. దాంతోఅలాంటి సైట్లను ఇష్టమొచ్చినట్టుగా ఉపయోగిస్తున్న వారిపై స్పందించని గూగుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ నిమ్మిత్తం సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: high court outraged google pornographic websites

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top