logo

బిడ్డకు జన్మనివ్వనున్న మహిళా జంట ..!


20-Aug-2019 19:25IST
women couple going to have baby

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టులోని సహచరులు, అమీ శాటెర్త్‌వైట్ (32), తహుహు (28) మార్చి 2017లో పెళ్లిచేసుకొని సంచలనం సృష్టించారు. ఈ మహిళా జంట తాజాగా మరో సంచలన ప్రకటన చేసి ప్రపంచ క్రీడా దృష్టిని ఆకర్షించింది. తన భార్య, లీ తహుహు గర్భంతో ఉందంటూ.. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ..  అమీ శాటెర్త్‌వైట్ చేసిన ప్రకటన, ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  

బేబీ శాటర్ హుహు 2020 జనవరిలో తమ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ, ఓ బేబీ ఫ్రాక్‌ను పోస్టు చేస్తూ.. శాటెర్త్‌వైట్ మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ జంట ఎటువంటి పద్దతిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కాగా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శాటెర్త్‌వైట్‌కు కూడా వేతనంతో కూడిన మాతృత్వపు సెలవును మంజూరు చేయడం విశేషం.
 
తమ జంట ఒక కుటుంబంగా మారే క్రమంలో..  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇస్తున్న మద్దతుకు ఆ జంట ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ మహిళా జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నఅమీ శాటెర్త్‌వైట్, 2021 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులో చేరుతానని స్పష్టం చేసింది. 119 వన్డేలు, 99 టీ20లు ఆడిన అమీ..  వన్డేల్లో వరసగా నాలుగు సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. ఇక 116 వన్డేలాడిన తహుహు 114 వికెట్లు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ జంట 2010 నుంచి సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags: newzealand women cricket ami shatterthwhite lee tahuhoo

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top