logo

బనానాతో బోలెడు ఆరోగ్యం..


21-Aug-2019 13:28IST
benifits of banana

బనాన అంటే జీర్ణ వ్యవస్థకు పెద్ద దిక్కు. అలా అనడానికి కూడా కారణం లేకపోలేదు.. భోజన ప్రియులు బొజ్జ నిండా తింటారు. ఇక తిన్నాక అది అరగదు. అలాంటి వాళ్లకు బనానా నాన్న లాంటిది. ఒక్క బననా కనుక తింటే ఆహారం ఇట్లే తిరిగిపోతుంది. కేవలం ఈ బనానా మాత్రమే కాదు దాని తొక్క కూడా పని చేస్తుంది. మనకు లూస్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ తొక్కతో సహా పండును తీసుకోవడం వల్ల వాటి సమస్యను పరిష్కరించుకోవచ్చును. 

అంతేకాదండోయి.. ఈ బనానా వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. కాస్త, ఈ బనానా ముక్కను తీసుకొని, ముఖాన్ని మసాజ్ లాగ చేసుకొని, పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం పై పేరుకున్న జిడ్డు, మట్టిని తొలగించేలా చేయడంలో ఈ బనానా మంచి మెడిసిన్. మాములుగా మనం పండు తిని తొక్కలను పడేస్తుంటాము. కానీ, ఈ తొక్కలను బాగా నీటితో కడగాలి. ఆ తొక్కలను కొన్ని నీళ్లు తీసుకొని బాగా వేడి చేయాలి. ఆ నీటిని చల్లార్చి కనుక తీసుకుంటే ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.. 

వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, పెరగాలనుకునేవాళ్ళు ఈ బనానాలను వాడుతుంటారు. వెంటనే శక్తినిచ్చే ఈ బనానాలను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యం లాభాలు అధికంగా ఉంటాయి.. తరచూ భోజన అనంతరం ఈ పండును తినడం మర్చిపోకండి..    

Tags: banana health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top