logo

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే..ఇక బాదుడే


22-Aug-2019 18:25IST
If you traffic rules breakyou will lose

హైదరాబాద్ సిటీలోని రోడ్ల మీద ఇష్టానుసారంగా వాహనాలను నడిపితే మీ పని అయినట్టే. సిటీ రోడ్లపై ఎక్కడ చూసిన పోలీసుల చేతుల్లోను, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద  హై డెఫినిషన్ సీసీ కెమెరాలు మనకు దర్శనమవుతుంటాయి. అందులో ఒక్క క్లిక్ పడితే చాలు... ఫైన్ మన ఇంటి చిరునామా వెతుకుంటూ వస్తుందనే విషాయాల గురించి మనకు తెలిసిందే. కాని ఇటీవల  సిటీలోని రోడ్లపై మోటార్ వెహికల్ యాక్ట్ ను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలపై ఇప్పటికే పోలీసులు ప్రచారం కూడా మొదలెట్టేశారు. 

ఇకపై ట్రాఫిక్ రూల్స్ లో ఏ ఒక్కటి బ్రేక్ చేసిన వాళ్ళ జేబులు కాలి కావాల్సిందే. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొన్ని చోట్ల ప్లెక్సీలు పట్టుకొని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులే టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు...పెండింగ్ చలానాలతో పట్టుబడితే వాహనాలను సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెబుతున్నారు. 

కొత్త చట్టం చలాన వివరాలు: 
1) ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్స్‌ వంటి వాటికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా..        ఇప్పటివరకూ రూ.100 జరిమానా ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనల చలానాలను  భారీగా        పెంచనున్నారు.      
2) లైసైన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.5 వేలు,
3) వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే రూ.2 వేలు,
4) ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, 
5) సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే రూ.వెయ్యి
6) హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ.వెయ్యి,
7) పరిమితికి మించిన లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు, 
8) డేంజరస్ డ్రైవింగ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు,
9) డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10వేలు
10) సిగ్నల్ జప్ చేస్తే రూ.5వేలు
11) ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.5వేలు
12) వ్రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.5వేలు
13) సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5వేలు

Tags: new traffic rules more fine mv act

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top