logo

స్టాక్ మార్కెట్లకు నేడు భారీ నష్టo ..!


22-Aug-2019 19:30IST
huge losses for stock markets today

స్టాక్‌ మార్కెట్లు రోజు రోజుకు పతనమవుతూ వస్తున్నాయి. ఎవరి ఊహలకు అందని విధంగా భారీస్థాయిలో నష్టానికై పట్టు బిగిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు బేజారెత్తిపోతున్న పరిస్థితి ఏర్పడింది. మదుపు దారులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో రియల్టీ, మెటల్‌, ఆటో, పీఎస్‌యూ షేర్లు భారీ నష్టానికి గురయ్యాయి. ఎఫ్‌పీఐల విషయంలో కేంద్రం కాస్త చల్లబడినప్పటికి  స్టాక్స్ మాత్రం ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. కానీ నేడు సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్ల వద్ద, నిఫ్టీ 700 పాయింట్ల వద్ద క్షీణించింది. 

మిడ్ సెషన్ తర్వాత కూడా సూచీలు మరింతగా క్షీణించాయి. చివరకు సెన్సెక్స్ 588 పాయింట్లు నష్టపోయి 36,473 దగ్గర ముగిసింది. నిఫ్టీ 178 పాయింట్లు పడిపోయి 10741దగ్గర స్థిరపడగా, బ్యాంక్ నిఫ్టీ 685 పాయింట్ల నష్టంతో 27034 వద్ధ స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.03 శాతం దిగొచ్చాయి. ఒక్క ఐటీ మినహా ఏ సెక్టోరల్ సూచీ కూడా లాభాలను ఘటించినట్టు ఎక్కడ కనిపించ లేదు. ముఖ్యంగా మెటల్స్, మీడియా, ప్రైవేట్ - పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లు కూడా దిగివచ్చాయి. బ్రిటాయనియా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టిసిఎస్, హిందుస్తాన్ యునిలివర్ టాప్ ఫైవ్ లాభదాయకంగా నిలిచాయి. యెస్ బ్యాంక్, వేదాంతా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ టాప్ ఫైవ్ నష్టపరమైన జాబితాలో నిలిచాయి. .

Tags: huge loss stock markets today

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top