logo

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


10-May-2019 09:35IST
A road acedent in Punjab

చంఢీఘర్: ప‌ంజాబ్‌లోని హోషియాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 10మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 13 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వీరంతా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉనా జిల్లాలోని ప్రార్థ‌నా మందిరాన్ని ద‌ర్శించుకునేందుకు మహింద్రా బొలెరో వాహనంలో వెళ్లారు. ద‌ర్శ‌నం అనంత‌రం తిరిగి వస్తుండగా వాహ‌నం అదుపుత‌ప్పి రోడ్డుప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టింది.  దీంతో వ్యానులో ఉన్న‌వారు బయటకు ఎగిరి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పదిమంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 13 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతుల కుటుంబాలకు కలెక్టర్ లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.

Tags: road accident Punjab

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top