logo

అర్ధరాత్రి నిఘా కెమేరాకు చిక్కిన ఆత్మ..


23-Aug-2019 19:21IST
The spirit caught at midnight surveillance camera

సాధారణంగా దెయ్యాలంటే భయపడని వారుండరు. అలాంటి దెయ్యాలను మనం సినిమాలల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటిది అవి మన ఇంట్లోకి వస్తే ఇంకేమైనా ఉందా.. పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుండి పరుగులు తీయడం ఖాయం. అలాంటి ఘటనే జోయి నోలన్ అనే వ్యక్తి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ ఇంట్లోని నిఘా కెమెరాలో చిక్కిన ఓ చిన్న వీడియో ఇప్పుడు 'యూట్యూబ్', 'రెడిట్' అనే సోషల్ మీడియా సైట్‌లలో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకెళితే... ఆగస్టు 8న జోయి నోలన్ ఇంట్లోని ఓ కెమెరాలో రికార్డైన వీడియోలో ఓ చిన్న పిల్లాడి రూపంలో ఉన్న ఆత్మ కిచెన్‌ నుంచి హాల్‌లోకి వచ్చి, అక్కడి నుంచి మెట్లు దిగి వెళ్తున్నట్టుగా ఉంది. అంతే కాకుండా ఆ పిల్లాడితోపాటు ఓ పిల్లి ఆత్మ కూడా ఇందులో కనిపించడం వింతగా ఉంది. అయితే ఈ ఘటన అర్ధరాత్రి 12.54 గంటల సమయంలో చోటుచేసుకుందని నోలన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదని, ఈ మధ్య తన కుటుంబంలోని ఏ వ్యక్తి మరణించలేదన్న సమాచారాన్ని కూడా తెలియజేశాడు. కానీ ఈ వీడియోని వీక్షించిన వారు మాత్రం అనేక రకాల కామెంట్లతో విమర్శిస్తున్నారు. మారి మీరు కూడా ఈ వీడియోని ఒకసారి వీక్షించి అదేంటో నిర్థారించుకోండి మరి.  


Tags: spirit caught midnight surveillance camera

Advertisement
Advertisement
Top