logo

మ‌ద్యం మ‌త్తులో యువతిపై సామూహిక అత్యాచారం


10-May-2019 09:47IST
Rape attempted

బెంగళూరు: మద్యం మత్తులో కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయి.. ప్రియుడి క‌ళ్ల‌ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘ‌ట‌న కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే... నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. వీరిద్దరూ కలిసి స‌ర‌దాగా నగర శివారులోని లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. వారిని చూసిన ఆరుగురు యువకులు అక్కడికి వెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు యువకుడిని పట్టుకుని సమీపంలోని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Tags: Rape attempted girl

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top