logo

విండీస్ తొలి ఇన్నింగ్స్ 222 పరుగులకు ఆలౌట్


24-Aug-2019 21:44IST
windies allout for222 in 1st innings

ఆంటిగ్వా వేదికగా భార‌త్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 75 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ ‌నైట్ స్కోరు 189/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన విండీస్ కేవలం 33 పరుగులను జోడించి మిగిలిన 2 వికెట్లను కోల్పోయింది. కాగా విండీస్ ఆటగాడు కమిన్స్ పదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 45 బంతులను ఎదుర్కొని పరులేమి చేయకుండానే వెనుదిరిగి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కాగా, విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(39 పరుగులు) చేయడంతో విండీస్ 200 మార్కును దాటగల్గింది. 

ఇక భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా, షమీ, జడేజా రెండేసి వికెట్లు చొప్పున తీసుకున్నారు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్, ప్రస్తుతానికి వికెట్లేమీ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా భారత్ కు 89 పరుగుల ఆధిక్యత లభించింది. 

Tags: india west indies 1st test antigua test championship

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top