logo

కేవలం రూ. 800లకే ఏసి.


26-Aug-2019 11:00IST
young mans AC invention just  Rs 800 only

గుజరాత్ లోని ఓ యువకుడి ఏసీ ఆవిష్కరణ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వేసవి కాలంలో పేదోడి ఫ్రిజ్‌గా పేరుగాంచింది మట్టికుండ. అసలు మట్టి కుండలో నీరు ఎందుకు చల్లగా మారుతాయో తెలుసా..? మట్టితో తయారు చేరిన ఈ కుండలో కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాల గుండా వేడిగాలి బయటకి పోవడం ద్వారా నీటిలో చల్లదనం పెరుగుతుంది. ఈ విషయం చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ళ వరకు తేలిసిందే. ఇట్టి సూత్రం గుజరాత్ కు చెందిన ఓ యువకుడి బుర్రకు పని పెట్టింది. ఒక వినూత్న ఆలోచన అతి తక్కువ ఖర్చుతో ఒక ఏసీని తయారు చేసేందుకు దోహదం చేసింది. ఇందుకు ఈ ఏసీ తయారీకి అయిన ఖర్చు ఎంతో తెలుసా..? కేవలం రూ. 800 మాత్రమే. ఈ ఏసీ పని తీరు విషయానికొస్తే 32 డిగ్రీల గదిలోని వేడిమిని 23 డిగ్రీల వరకూ తగ్గించడమే దీని స్పెషాలిటీ. ఇంతకీ ఈ ఏసీని తయారు చేసిన సూత్ర దారి పేరు.. 'మనోజ్ పటేల్'.

అసలు ఏసీని కొనుగోలు చెయ్యలేని మధ్య తరగతి కుటుంబాలకి అతి తక్కువ ఖర్చుతో ఏసీ అందించాలన్న కోరిక మనోజ్ పటేల్ ను ఈ వినూత్న ఆవిష్కరణ వైపుగా నడిపించింది. అంతే కాకుండా మట్టికి బదులుగా.. పింగాణీ వస్తువులను వాడి మరో  మూడు మోడళ్లలో ఎయిర్ కండిషనర్లను తయారుకి చేసాడు. వీటి నుండి వచ్చే గాలి చల్లగా ఉండేందుకు ఒక వాటర్ ట్యాంకుని అమర్చాడు. ఆ ట్యాంకులోని నీటి మోతాదు తెలిసేలా ఓ సూచికను ఏర్పాటు చేశాడు. అంతే కాదండోయ్.. ఒక చిన్న మొక్కను పెంచుకునేలా దాన్నీ రూపొందించాడు. ఈ ఏసీని ఆఫీసుల్లో, ఇళ్లల్లోనూ ఓక్ చోట అమర్చుకొని వాడుకోవచ్చు. పింగాణీ ఏసీలో ఒక ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉంటుంది. ఒకసారి దానికి అమర్చిన నీటి ట్యాంకును నింపితే దాదాపు12 రోజుల వరకు ఆ నీటిని వాడుకుని చల్లదనాన్ని పొందవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టిని వాడటం వల్ల దీని తయారీకి రూ.800 మాత్రమే ఖర్చు అయ్యిందని మనోజ్ చెప్పుకొచ్చాడు. 

Tags: AC invention just Rs. 800 gujarat manoj

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top