logo

నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


26-Aug-2019 17:54IST
stock markets ending today with profits

నేడు దేశీ మార్కెట్లు లాభాలతో ముగిసింది. అనలిస్టుల అంచనాల మేరకు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ఏ మాత్రం తగ్గకుండా ముందుకు దూసుకెళ్లింది. ఆరంభం నుండి మిడ్‌సెషన్‌లో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ కాస్త సమయం తరువాత వెనకడుగు వెయ్యకుండా ముందుకు దూసుకెళ్లింది.ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగం లాభాలను ఘటించాయి. అనంతరం సెన్సెక్స్‌793  (37494) నిఫ్టీ 229 (11057) పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్‌ నిఫ్టీ 1000 పాయింట్లు చేరుకుంది. అయితే గత మూడు నెలల కాలంలో దేశీ మార్కెట్లు ఇంత భారీగా లాభపడిన దాఖలాలు లేవూ.
Image result for mumbai stock market profit
ఇంచు మించుగా అన్ని రకాల రంగాలు లాభ పడ్డాయి. అందులో ముఖ్యంగా బ్యాంకు రంగం అధిక లాభాలను ఘటించింది. యస్‌బ్యాంకు, అదానీ పోర్ట్స్‌,హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌  ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌  సర్వ్‌, ఇండియా బుల్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, జీ టాప్‌ లాభాలను ఘటించగా... జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా,  హీరో మోటో, టాటా స్టీల్‌, వేదాంతా,  హిందాల్కో, భారతి ఇన్‌ఫ్రా టెల్‌,  బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, సిప్లా టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  రిలయన్స్‌ కూడా స్వల్పంగా నష్టపోయింది. విదేశీ డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా  ఉంది.  మరోవైపు  పసిడి రికార్డు స్థాయికి చేరాయి. వెండి ధర ఇదే బాటలో ఉంది. 

Tags: mumbai stock markets ending with profits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top