logo

దొంగతనం చేసింది.. బిడ్డను మరిచింది..!


26-Aug-2019 18:33IST
mother left her child where she theft a stoler

ఎవరికోసమైతే దొంగతనం చేసిందో.. ఆ బిడ్డనే అక్కడ వదిలేసి వెళ్లిన ఘటన న్యూజెర్సీలోని ఓ స్టోర్‌లో చోటుచేసుకుంది. ఒక మహిళ, తన బిడ్డ కోసం స్టోలర్‌ను దొంగిలించాలని వెళ్లి, తొందరలో ఆ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్ళింది. సదరు మహిళ, బిడ్డతో పాటు మరో ఇద్దరు మహిళలతో కలిసి ఓ స్టోర్‌లోకి వెళ్ళింది. స్టోలర్‌ను దొంగిలించాలని వెళ్లిన ఆ మహిళ, తన ఫ్రెండ్స్‌ను స్టోర్‌ యజమానితో మాటలు కలుపమని చెప్పి.. తన పనిని కానిచ్చేసి మెల్లగా జారుకుంది. కాసేపటికి ఆమె స్నేహితులు కూడా స్టోర్‌ నుంచి జారుకున్నారు. 

తీరా వారు బయటికి వెళ్లాక చూసుకుంటే..తమ వెంట తీసుకువచ్చిన బిడ్డ కనిపించకపోవడంతో.. బిడ్డ కోసం తిరిగి  స్టోర్‌లోకి వెళ్లారు. అప్పటికే, బిడ్డను గమనించిన స్టోర్ యజమాని సీసీ కెమెరా ఆధారంగా జరిగిన దొంగతనాన్నికనిపెట్టారు. బిడ్డను వెతుక్కుంటూ వచ్చిన ఆ ముగ్గురు మహిళలను పట్టుకొని..  పోలీసులకు అప్పగించారు. 

కాగా, ఆ మహిళ దొంగతనం చేస్తున్న దృశ్యాలను సదరు షాపు యజమాని తన ఫేస్‌బుక్ లో అప్‌లోడ్‌ చేశాడు. 'దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం, కానీ ఎవరికోసమైతే దొంగతనం చేసారో వారినే అక్కడ మరచి వెళ్లడం దారుణం' అంటూ కామెంట్స్ పెట్టాడు. ఇలాంటి వాళ్లకు బుద్ది రావాలనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నాఅంటూ ఫేసుబుక్ లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బిడ్డను మర్చిపోయి వెళ్లిన తల్లిపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Tags: women theft child newjersey face book

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top