logo

అరుణ్ జైట్లీ పేరుగా మారనున్న క్రికెట్ స్టేడియం


27-Aug-2019 19:41IST
cricket stadium to be named as arun jaitle

డీడీసీఏ ప్రెసిడెంట్‌గా దాదాపు 11 ఏళ్లు సేవలందించిన బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే మృతిచెందిన సంఘటన అందరిని కలచి వేసింది. బీసీసీఐ లో కీలక పదవులను అలంకరించిన జైట్లీ క్రికెట్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీకి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నేడు ఘన నివాళి అర్పించింది. ఆయన జ్ఞాపకార్థంగా ఢిల్లీలోని 'ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం' పేరును 'అరుణ్ జైట్లీ స్టేడియంగా' మార్చేందుకు సిద్ధం అవుతుంది. అందుకు గాను సెప్టెంబర్ 12న ఒక సమావేషాన్నీ ఏర్పాటు చేసి అధికారికంగా పేరుని మార్చబోతున్నట్లు సమాచారం. 

ఫిరోజ్‌షా కోట్ల స్టేడియానికి 'అరుణ్ జైట్లీ స్టేడియం' అని పేరుని మాత్రమే మార్చనున్నామని, గ్రౌండుని మాత్రం 'ఫిరోజ్‌షా కోట్ల గ్రౌండ్' గా పిలవనున్నట్లు డీడీసీఏ అధికారి వెల్లడించారు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రా, రిషభ్‌ పంత్‌తో పాటు చాలా మంది క్రికెటర్లు అరుణ్ జైట్లీ పోత్సాహం వల్లే దేశం గర్వించే స్థాయికి వెళ్లారని డీడీసీఐ అధ్యక్షుడు రజత్ శర్మ అన్నారు. డీడీసీఏ లో అరుణ్ జైట్లీ కారణంగానే అనేక మార్పులు జరిగాయని గుర్తు చేశారు. వచ్చే నెలలో జరగనున్న కార్యక్రమానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి రిజుజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Tags: firozshah kotla cricket stadium arun jaitle

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top