logo

స్థిరంగా ఉన్న పసిడి.. కొండెక్కిన వెండి


27-Aug-2019 20:20IST
gold prices steadyrising silver rates jumps to new high

గత నేల రోజుల నుండి చేతికందని ద్రాక్ష పండుల పైకి..పైకి వెళ్తున్న బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన అనంతరం, నేడు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 కారెట్ల పసిడి  ధర రూ.39670 గా నిలిచింది. హైద్రాబాద్ లో 10గ్రాముల 24 కారెట్ల పసిడి ధర రూ.39800గా... విజయవాడలో రూ.39795గా నమోదు అయ్యింది. ఇటీవలే అమెరికా, చైనా మధ్య జరిగిన వివాదమే బంగారం ధర 6 సంవత్సరాల గరిష్టాన్ని తాకేందుకు కారణమయ్యింది. రానున్న ఈ మూడునెలల్లో విదేశీ మార్కెట్లలో బంగారం ధర ఒక ఔన్సు పరిమాణానికి 1600 డాలర్లు దాటడం ఖాయమని యూబీఎస్ గ్రూప్ ఏజీ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దాంతో పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవని బంగారం కొనుగోలు దారులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఇదిలా ఉండగా... వెండి ధరలు కూడా పసిడి వలే కొండెక్కి కూర్చున్నాయి. వెండి ధర ఒకే రోజు 190 రూ.లు పెరిగి కేజీ రూ.46740గా నమోదైంది. రానున్నది పండుగల సీజన్ కాబట్టి ఇప్పట్లో పసిడి , వెండి ధరలు తగ్గే అవకాశాలు లేకపోగా.. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా మార్కెట్ వర్గాల అంచనా.

Tags: gold prices steady silver rates rising

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top