logo

ఏటీఎం లో కార్డు పెడితే...మీ ఖాతా ఖాళి


27-Aug-2019 21:05IST
If the card is placed in the ATM  your account is empty

సాధారణంగా మనకు డబ్బులు కావాలంటే వెంటనే మనం సమీపంలోని ఏటీఎం కి వెళ్లి కార్డు పెట్టి కావాల్సినంత డబ్బును వెంటనే డ్రా చేసుకుంటాము. కానీ, ఇప్పుడు ఏటీఎంలో కార్డు పెట్టిన మరుక్షణమే మీ ఖాతాలోని డబ్బు మీకు తెలియ కుండానే మాయమయ్యే అవకాశం ఉంది. విషయం ఏంటి అని అనుకుంటున్నారా..? ఢిల్లీలోని ఓ ఏటీఎంలో హైటెక్ మాయగాళ్లు చేసిన నిర్వాకం ఏంటో తెలిస్తే షాకవ్వుతారు..! కార్డు సమాచారాన్ని దొంగిలించి హైటెక్ లెవెల్ ల్లో చోరీ చేస్తున్న ఘటన ఇటీవల బయటపడింది. 

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలోని కెనరా బ్యాంకు ఏటీఎంలో కొందరు కార్డ్ స్కిమ్మింగ్ ఎంట్రాప్మెంట్ను మెషిన్ ని కనుగొన్నారు. దానితోపాటు ఏటీఎం పర్సనల్   పిన్ కొట్టేందుకు ఉపయోగించే కీబోర్డు పైన మరో చిన్న కెమేరాను గుర్తించారు. వీటి ఆధారంగా కార్డు వివరాలను తెలుసుకునే మోసగాళ్లు, వినియోగదారుడి పిన్ నెంబరు సైతం తెలుసుకుని క్లోన్ చేసి. ఆ కార్డులో వివరాలతో అకౌంట్లో డబ్బులను కొల్లగొడుతున్నారు. 

కావున ఇప్పటి నుండి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోడానికి ముందు ప్రతి వ్యక్తి తప్పకుండా తనిఖీ చేయాలి. అనుమానస్పదంగా ఏమైనా యంత్రాలు కనిపిస్తే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి. ఈ ఘటనపై స్పందించిన అధికారులు గౌతమీ నగర్‌లోని ఏటీఎం నుంచి స్కిమ్మర్‌ను తొలగించామని తెలిపింది. ఇలాంటివి గుర్తించిన వెంటనే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయండని పేర్కొంది. ఇట్టి సంఘటనపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ బ్యాంకు వినియోగదారులను హెచ్చరిస్తూ ఓ ట్విట్టర్ వీడియోను పోస్టు చేశారు. 

Your card can be cloned at ATMs 😨 This ATM had a camera & chip installed very cleverly. WATCH video to see what to check before using ATMs 👀

Tags: delhi canara ATM account empty

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top