logo

పుల్లని ద్రాక్షతో పుట్టెడు ఆరోగ్యం ..


29-Aug-2019 08:57IST
benifits of grapes

అందని ద్రాక్ష పుల్లన..అనే సామెతకు తగ్గట్లే పేరు వినగానే నోరు ఊరుతుంది కదా..ద్రాక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి..సిట్రస్ ఎక్కువ గా ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి .ఈ ద్రాక్షలు ముచ్చటగా మూడు రకాలుంటాయి..అవి ఎరుపు, నలుపు,పచ్చ రంగుల్లో విరివిగా దొరుకుతాయి. తక్కువ ధరలో ఎక్కువ లాభాలున్నా ద్రాక్షే కాకుండా అందులో ఉన్న గింజలు వల్ల కూడా మనకు అనేక లాభాలున్నాయంట..అవేంటో చూద్దాము..

ద్రాక్ష వలన ఉపయోగాలు ఏంటో చూద్దాం

1 . అధిక బరువును తగ్గించుకోవాలనే వాళ్ళు ద్రాక్ష గింజలను ఎండబెట్టి పొడి చేసుకొని రోజు రాత్రి పాలల్లో వేసుకొని తాగితే..అతి సులువుగా బరువు తగ్గిపోవచ్చు అంట 2. రోజులో ఎక్కువ భాగం కూర్చొని పనిచేసే వాళ్ళు రోజు కొన్ని ద్రాక్షలను తింటే కనుక పోయిన శక్తిని తిరిగి పొందవచ్చునట..ఇలా తరచూ తినడం వల్ల శరీరంలోని మలినాలు తొలగి..నిత్యం ఉత్సాహంతో ఉంటారు.
3. ఎరుపు రంగు ద్రాక్షలను రోజు ఓ గుప్పెడు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది మరియు మధుమేహ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది.
4. తిని పడేసే ద్రాక్ష తొక్కలో కూడా పోషకాలు ఉన్నాయి.తొక్కలను ఎండబెట్టి పొడి చేసి,కొంచం నిమ్మరసం ,కాస్త తేనే కలుపుకొని పాలల్లో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.
5. ప్రతి రోజు ద్రాక్ష పండ్లను తీసుకోవడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం శుభ్రపడి మంచి కలర్ కూడా వస్తారు ..అంతేకాకుండా కంటిచూపు మెరుగు పడుతుంది కూడా.
6. ఎరుపు రంగు ద్రాక్షలు మన శరీరం లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి అలాగే చెడు బ్యాక్టీరియాలు, వ్యర్థాలు ను కూడా తొలగిస్తుందంట.
7.  ద్రాక్ష గుజ్జులో కాస్త చక్కెర ,తేనే కలుపుకొని తీసుకొంటే కీళ్లనొప్పులు ,గుండె సంబంధిత వ్యాధులు పూర్తిగా తగ్గుతాయి
 
చూసారుగా పుల్ల ద్రాక్షలో పుట్టెడు ఆరోగ్య లాభాలున్నాయి. వాటిలోని గింజలవల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి..కదా రోజు కనీసం రెండు పండ్లయినా తినడం వల్ల మన ఆరోగ్యం మన కంట్రోల్ లో ఉంటుంది …అందువలన ద్రాక్షలు తినడం మర్చిపోకండి…చిన్న పండు పెద్ద మేలు కనుక ఇప్పటి నుండి తినడం మొదలెట్టండి. 


Tags: grapes health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top