logo

నవ్వుకి ఒక కొత్త కోర్సు..!


29-Aug-2019 15:03IST
a new course for laughter

ఎప్పుడు కనీ వినీ ఎరుగని ఒక విచిత్రమైన కోర్స్ మన భారత దేశంలో రాబోతుంది. అదే 'హ్యాపీనెస్ కోర్స్' అదేంటని ఆశ్చర్య పోతున్నారా..! అవునండీ... మన భారత దేశంలో ఎంతో మంది చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మ హత్యలు, డిప్రషన్, కోపాలు, ఆరోగ్యం వంటి వాటి నుండి ఎలా దైర్యంగా మెలగాలన్న అంశాలపై శిక్షణ ఇస్తారంట...ముఖ్యంగా విద్యార్థులను డిప్రెషన్ నుంచీ బయటపడేసే కోర్స్ ఇది. ఇందుకు గాను మత పెద్దలు, సోషల్ వర్కర్లు, ఆర్టిస్టులు, న్యాయ నిపుణులు ఇలా ఎన్నో రంగాల్లో నైపుణ్యం కలిగిన వారితో చర్చించిన తర్వాత ఒక యూనివర్శిటీ ఈ కోర్స్ తెచ్చింది.

వివరాల్లోకెళితే.... గుజరాత్ లోని ఒక యూనివర్శిటీ ఈ  హ్యాపీనెస్ కోర్సు తేనుంది. ఈ  ప్రకటన చెయ్యగానే అక్కడి ప్రాంతంలోని వారంతా ఆశ్చర్యపోయారు..! అయితే ఈ కోర్సులోని  క్లాసులు రోజు వారీగా ఉండవు. ఇది మూడు నెలలపాటూ ప్రతీ వీకెండ్‌లో ఉంటుంది. ఇందులో వేదాలు, ఉపనిషత్తుల గురించి వివరిస్తారు. అలాగే విద్యార్థులకు డాన్స్, మ్యూజిక్, గాంధీజీ సిద్ధాంతాలు, అహింస, క్షమాగుణం, ప్రార్థనలు, మెడిటేషన్, ఫిలాసఫీ వంటివి నేర్పిస్తారు. అలాగే మంచి ఆహరం, నిద్రపై కీలకమైన శిక్షణ ఇస్తారు. అంతే కాదు నవ్వడం, మాట్లాడటంపై ప్రత్యేకమైన థెరపీ ఇస్తారు. 

ఇలాంటి ఒక కోర్సు మన దేశంలో రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే..? ప్రపంచ హ్యాపీయెస్ట్ దేశాల్లో ఇండియా చాలా వెనకబడి ఉంది. 2018లో... 156 దేశాల్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారంగా... ఇండియా 133వ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీలో 15 సీట్లను మాత్రమే కేటాయించారు. దీనికి గాను  ఫీజు రూ.5,250గా నిర్ధారించారు. విద్యార్థులు తమ చదువులను కొనసాగిస్తూనే ఈ కోర్సు చెయ్యడానికి వీలు కలిపించారు. ఈ కోర్సు విద్యార్థి దశలో వున్న వారికీ  కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడమే కాదు... స్ట్రెస్ నుంచీ ఉపశమనం పొందడంలో కీలక మార్పులని తెస్తుందనీ ప్రొఫెసర్లు తెలిపారు. 
 
వారి జీవితంలో విద్యార్థి దశ ముగిసిన తర్వాత... వారి చదువులకు తగ్గ ఉద్యోగాల్లో చేరేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ఇచ్చే శిక్షణ వారి జీవితాల్లో ఎంతో మార్పును తీసుకు రావడంలో ఈ హ్యాపీనెస్ కోర్స్ కీలక పాత్రను పోషించనుందని వివరించారు. అంతే కాకుండా మన భారతీయ మూలాలు, పురాణాలు, మహాభారతం, భగవద్గీతలో సంతోషానికి సంబంధించిన అంశాలున్నాయని వాటి గురించి విద్యార్థులకు అవగాహన కలిపించేందుకు కృషి చేస్తామని వారు చెబుతున్నారు. 

Tags: a new course laughter India gujarath

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top