logo

అరుదైన రికార్డు కు చేరువలో అశ్విన్


29-Aug-2019 15:53IST
spinner ashwin close to overcome muralitharan record

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో 8 వికెట్ల తీస్తే.. టెస్ట్ ఫార్మటులో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రలో నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ అశ్విన్ కు వచ్చింది. మురళీధరన్ 66 టెస్టుల్లో 350 వికెట్లు సాధించగా.. ప్రస్తుతానికి అశ్విన్ 65 మ్యాచుల్లో 342 వికెట్లను తీశాడు. విండీస్‌తో జరగబోయే రెండో టెస్ట్‌లో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే.. వేగంగా 350 వికెట్ల క్లబ్ లో చేరిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. 


ఇదిలా ఉండగా, తొలి టెస్టులో అశ్విన్ కి బదులు రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,  తొలి  టెస్టులో జడేజా అంతగా రాణించక పోవడంతో... రేపటి నుంచి జరగబోయే రెండో టెస్టులో జడేజాకు బదులు అశ్విన్ ను జట్టులోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. కాగా, రెండో టెస్టు జరగబోయే సబీనా పార్క్ మైదానం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం.

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter 

    

Tags: ravichandran ashwin muralitharan indian off spinner rare record india windies second test

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top