logo

నష్టాల బాటలో స్టాక్‌మార్కెట్లు


29-Aug-2019 16:11IST
stock markets on the path of losses

వరుసగా రెండో రోజు కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలో సాగింది. నేడు నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ మిడ్‌ సెషన్‌ నుంచి మరింత కిందికి పతనమయ్యింది. ఇన్వెస్టర్లు అమ్మకాలతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా క్షీణించింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌  292 పాయింట్లు క్షీణించి 37,160 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,975 వద్ద ట్రేడవుతోంది.  ఒకదశలో  నిఫ్టీ10950 పాయింట్ల మరో కీలక మార్క్‌ కిందికి చేరింది. బాండ్ల ఈల్డ్స్‌ తగ్గిన కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక పరిణామాలు ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయని ఎనలిస్టులు చెప్పుకొచ్చారు.  


ప్రధానంగా ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ క్షీణించగా, మెటల్‌, ఫార్మా రంగాలు స్వల్ప లాభాలను పొందింది.  సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, వేదాంతా, టాటా మోటార్స్‌, ఐషర్‌, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, జీ టాప్‌ గైనర్స్ గా కొనసాగుతుండగా, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్రిటానియా, గ్రాసిమ్‌, యాక్సిస్‌, బజాజ్‌ ఆటో, కొటక్‌ మహీంద్రా శాఖలు ప్రధానంగా నష్టాలకు గురవుతున్నాయి.  

Tags: stock markets losses nifty

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top