logo

వైఎస్‌ ఎప్పుడు చనిపోయారు? గ్రూప్ 2 లో ప్రశ్న


31-Aug-2019 10:09IST
ysr died date question in group 2 exam

'గ్రూప్ 2 పరీక్షనా' బాబోయి చాలా టఫ్ గా ఉంటుంది అని భయపడ్డారు ఆ పరీక్షా అభ్యర్థులు. కానీ అక్కడికి వెళితే 150 ప్రశ్నలకు దాదాపు 130 ప్రశ్నలకు సమాధానాలను అందరూ గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందట. దాదాపు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనసాగిన పథకాలపైనా ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చాయిని పరీక్షా అభ్యర్థులు తెలిపారు. ఈ ప్రశ్నపత్రం అంత గ్రామీణాభివృద్ధి కేంద్రంగా ప్రశ్నలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలున్నాయి అని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ గ్రూప్ 2 పరీక్షా పత్రం చాలా సులువుగా ఉందని, ప్రతిరోజు పేపర్ చదివే వారికీ ఈ పరీక్షా సులువుగా ఉంటుంది అని పరీక్షా రాసిన అభ్యర్థులు తెలిపారు.
 

అయితే గ్రూపు-2 ప్రధాన పరీక్షల అభ్యర్థులకు సంధించిన ప్రశ్నలలో అతి సులువైన ప్రశ్నలు ఇవే.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తేదీ ఏది? ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది జనాభాకు ఒక చౌక దుకాణం ఉంది? రాష్ట్ర రాజధానికి ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? ఏపీలో పురపాలక సంఘాలు, ఫార్మాసెజ్‌ల సంఖ్య.. 2018లో జీఎస్‌డీపీలో రాష్ట్ర ర్యాంకు ఎంత?

Tags: group 2 exam ys rajashekar reddy died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top