logo

నేపాల్ టు చైనా..వయా భారత్


31-Aug-2019 12:06IST
human traffiking from nepal to china via india

మన పొరుగున ఉన్న నేపాల్ దేశం నుంచి మహిళలను (బాలికలు కూడా ఉన్నారు) అక్రమంగా చైనా దేశానికి తరలిస్తున్న ఒక ముఠాను, నేపాల్ పోలీసులు పట్టుకున్నారు. నేపాల్ దేశానికి చెందిన బాలికలు, మహిళలను వధువులుగా చూపిస్తూ.. వారిని అక్రమంగా భారతదేశం మీదుగా చైనాకు తరలిస్తుండగా నేపాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ బ్యూరో ప్రతినిధులు, నేపాల్ పోలీసుల సంయుక్తంగా జరిపిన దాడుల్లో నలుగురు చైనా జాతీయులతో సహా మొత్తం పది మంది నిందితులను అరెస్టు చేశారు. కాగా, ఈ ముఠా గతంలో కూడా పలువురు అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలించారని నేపాల్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

Tags: human traffiking nepal china nepal police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top