logo

మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో బోటు బోల్తా... 65 మంది మృతి


11-May-2019 10:21IST
65 people killed in boat in the Mediterranean Sea

మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. టునీషియా తీరం ద‌గ్గ‌ర బోటు బోల్తాప‌డి సుమారు 65 మంది శ‌ర‌ణార్థులు మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది. బోటులో ప్ర‌యాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు యూఎన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. లిబియాలోని జువారా నుంచి బోటు మొద‌లైన‌ట్లు దుర్ఘ‌ట‌న నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌వారు చెప్పారు. బ‌ల‌మైన అల‌లు రావ‌డంతో బోటు బోల్తా ప‌డిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ ఏడాది మొద‌టి నాలుగు నెల‌ల్లోనే లిబియా నుంచి యూరోప్ మ‌ధ్య ఉన్న జ‌ల‌మార్గంలో సుమారు 164 మంది చ‌నిపోయిన‌ట్లు యూఎన్ సంస్థ వెల్ల‌డించింది.

Tags: boat acedent Mediterranean Sea

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top