logo

ఎక్కువ చేస్తానంటున్న నిత్యామీన‌న్‌ ..!


31-Aug-2019 16:25IST
nithya menon sensation dailogs

త‌న‌కు ఆ ప‌ని చేయ‌డం బాగా న‌చ్చింద‌ని, భ‌విష్య‌త్తులో ఎక్కువ చేస్తాన‌నీ అంటోంది నిత్యామీన‌న్‌. ఇంత‌కీ ఈ భామ‌కు అంత‌గా న‌చ్చిన ఆ ప‌ని ఏంట‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన అంశాలే చెప్పుకొచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో న‌టించ‌డం త‌న‌కు బాగా న‌చ్చింద‌ట‌. దాని గురించి నిత్య వివ‌రించింది. ``నేను ఈ మ‌ధ్య‌నే బ్రీత్‌2 అని ఓ సీరీస్ చేశాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. 
నాలాంటి ఆర్టిస్టుల‌కు స‌రైన ప్లాట్‌ఫార్మ్ అది. చాలా సెటిల్‌గా, సెన్సిటివ్‌గా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో వ‌చ్చే కంటెంట్ ఆర్టిస్టుల‌ను త‌మ హ‌ద్దులను చెరిపేసేలా చేస్తుంది. త‌మ‌లోని న‌టీన‌టుల‌ను మ‌రింతగా ఆవిష్క‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంది. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటివాటిని చాలా చేయాల‌నుకుంటున్నా`` అని తెలిపారు. ఇటీవ‌ల మిష‌న్ మంగ‌ళ్‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్నారీ మ‌ల్లుభామ‌.  బ్రీత్‌2లో అభిషేక్‌బ‌చ్చ‌న్‌తో పాటు నిత్యామీన‌న్‌ని చూడొచ్చు. త‌న‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా కృష్ణుడితో చెప్పుకుంటాన‌నే ఈ భామ ఈ మ‌ధ్య‌నే లావు గురించి, బాడీ షేమింగ్ గురించి త‌న గ‌ళం విప్పారు.  

Tags: nithya menen breath 2 webseries

Advertisement
Advertisement
Top