logo

రేపటి నుండి కాణిపాకం బ్రహ్మోత్సవాలు ..


01-Sep-2019 18:04IST
kanipakam bramhothsavalu from tomorrow

చిత్తూరు జిల్లా కాణిపాకం దేవాలయంలో వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 21 రోజులపాటు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. సెప్టెంబర్ 2 వినాయక చవితి నాడు ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతాయి. భక్తుల సౌకర్యార్ధం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చిత్తూరు, తిరుపతి ఏరియాల నుంచి కాణిపాకంకు  ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
Related image

Tags: kanipakam bramhothsavalu vinayakachavathi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top