logo

మీడియా కేసులో చిదంబరానికి సుప్రీం ఊరట


02-Sep-2019 22:15IST
chidambaram  extends his cbi custody

ఇటీవలే ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. తన వయసు రీత్యా తీహార్‌ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. చిదంబరం ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని  లాయర్‌ కపిల్ సిబాల్ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి విజ్ఞప్తి చేశారు. 

ఇలాంటి పరిస్థితుల్లో చిదంబరాని జైలుకు పంపకుండా గృహనిర్బంధంలోగాని, సీబీఐ కస్టడీలోగాని ఉంచాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన ధర్మపీఠం ఈ విషయాన్ని ట్రయల్‌ కోర్టులో ప్రస్తావించాలని సూచించింది. సిబల్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశాలను జారీ చేసింది. 

Tags: chidambaram extends cbi custody supreme court

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top