logo

నేడు భారీగా పతనమైన సెనెక్స్...


03-Sep-2019 17:36IST
sensex fall down heavily today

నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు జీడీపీ పతనం దెబ్బతో కోలుకోలేకుండా పడిపోయింది. నేటి దేశీయ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్‌లో ట్రేడింగ్ సెషన్‌లో సుమారు రూ.3 లక్షల కోట్ల సొమ్ము ఒక్కసారిగా ఆవిరయ్యింది. ఇప్పటి వరకు గడచిన 11 నెలల్లో ఇంత ఘోరంగా పతనం కావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు దేశీయ మార్కెట్ ముగిసే నాటికి సెన్సెక్స్ -769.88 పాయింట్లు నష్టపోయి 36562.91 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ -225.40 పాయింట్లు నష్టపోయి 10797.90 వద్ద ముగిసింది. 

ఇక మరో కీలక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 603 పాయింట్లు పతనమై 26824 వద్ద ముగిసింది. గతంలో 2018 సంవత్సరం అక్టోబర్‌లో సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయింది. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో సెన్సెక్స్ పడిపోయింది. మార్కెట్లను భారీగా పతనానికి గురిచేసిన సెక్టార్ల పరంగా చూసినట్లయితే నిఫ్టీ మెటల్స్ సూచీ 3 శాతం పతనమైంది. ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని మార్కెట్లు నెగిటివ్ గా తీసుకోవడంతో నిఫ్టీ ప్రభుత్వ బ్యాంకుల సూచీ ఏకంగా 4.87 శాతానికి దిగి వచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో కెనెరా బ్యాంక్ 10 శాతం పతనం కాగా, ఇండియన్ బ్యాంక్ 11.68 శాతం పతనమైంది. ఇక పీఎన్‌బీ 8.47 శాతానికి పతనమై నష్టాల్లో రికార్డు స్థాయిని నెలకొంది.  

Tags: sensex selloff trade down today

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top