logo

యూరియా కోసం వెళ్లిన రైతు మృతి


05-Sep-2019 15:07IST
farmer shocking dead in queue for urea

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తమ పొలాలను సాగు చేసి పంటలు వేసారు. ఈ నేపథ్యంలో పొలానికి యూరియా కొనడానికి వెళ్లిన రైతు గుండెపోటుతో మరణించిన సంఘటన అందరిని కలచి వేసింది. వివరాలోకెళితే...సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండల అచ్చుమాయపల్లికి చెందిన రైతు ఎల్లయ్య తన పొలానికి యూరియా కొనేందుకు మండల్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర క్యూలో నిల్చున్నాడు. 

కొద్దిసేపటికి ఎల్లయ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. దాంతో గమనించిన స్థానికులు వెంటనే ఎల్లయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఎల్లయ్య యూరియా కోసం క్యూలోనే నిలబడ్డాడని, యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలపై అధికారులకు పట్టింపు లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు . 

ఈ క్రమంలో యూరియా కొరత అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలైజర్స్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. మరికొందరు మ‌ృత్యువాతపడుతున్నారు. అటు.. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా, యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.  

Tags: farmer shocking dead queue for urea siddipeta

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top