logo

లిప్స్టిక్ వాడేవాళ్లు ఇవి చూడండి..


06-Sep-2019 11:13IST
drawback of lifstic

మనము నిత్యం అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము.. ఆ ప్రయత్నంలో మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాము. అయితే మేకప్ లో ముఖ్యంగా కనిపించే లిప్స్టిక్ ని వాడటం వల్ల ఇంకా అందంగా కనిపిస్తూ ఉండాలనే ఉద్ద్యేశంతో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఈ లిప్స్టిక్ ని వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూదాం..

Image result for lipstick

గర్భిణులూ జాగ్రత్త! లిప్స్టిక్ లు, మాయిశ్చరైజర్లు తదితర సౌందర్య సాధనాలను వినియోగిస్తే… వాటిలోని రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట. ఇంకా వాళ్ళు ఎదుగుతున్న ఏజ్ లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు . బాడీలోషన్లను , అందానికోసం వాడే క్రీముల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయి.




ఈ లోషన్లను ప్రెగ్నెంట్ వాళ్ళు కనుక వాడితే వాళ్లకు పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని చెప్పారు. ‘‘గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారికి పుట్టే పిల్లలు యుక్తవయసుకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. చురుగ్గా కదల్లేరు. పైపెచ్చు ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది. వీటితో పాటు, వీళ్ళు ప్లాస్టిక్ వస్తువులను, ఫుడ్ నిల్వచేసే ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని వాడకుండా ఉండటం మంచిదంటున్నారు” డాక్టర్ ఫాక్టర్‌-లిత్వాక్‌ .

Tags: lipstic feedback

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top