logo

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు


06-Sep-2019 16:26IST
srivari bramhothsavalu works finish

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి తెలిపారు. భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల నాలుగు మాడ వీధులు, ఇతర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లపై సివిఎస్వో గోపినాథ్ జెట్టి, తిరులమ అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తో కలిసి పరిశీలించారు. ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు బందోబస్తు, బారికేడింగ్, తిరుమల, తిరుపతిలో పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించామన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. భక్తుల వాహనాల పార్కింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
Image result for srivari brahmotsavam, ttd

Tags: srivari bramhothsavalu ttd

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top