logo

చంద్రయాన్ 2 ఫై పాక్ సెటైర్లు, ధీటుగా బదులిస్తున్న భారత్


07-Sep-2019 11:50IST
pakistan sattirical comments on chandrayan2 india counter attacks

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగం, చివరి దశలో ఆటంకం కలగటంతో... చంద్రుడి ఉపరితలానికి కేవలం కొద్ది దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ కట్ అయ్యాయి. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్వేగానికి లోనైయ్యారు. స్వయానా ప్రధాని మోదీనే వారికి ఓదార్చారు. చంద్రయాన్ 2ను సక్సెస్ చేయడానికి, ఇస్రో శాస్త్రవేత్తలు పడ్డ శ్రమను పలువురు ప్రముఖులు కొనియాడారు. వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు... చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. వారు ఇప్పటికే గొప్ప విజయం సాధించారని, తమతమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

అయితే, వక్రబుద్దికి కేర్ అఫ్ అడ్రస్ అయిన 'పాకీ'జా లు మాత్రం చంద్రయాన్ 2 ఫై తమ అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు. పాక్ అధికారుల దగ్గరి నుండి అక్కడి నెటిజన్లు వరకు అందరూ, ఈ ప్రయోగంపై వెకిలి ట్వీట్లు చేస్తున్నారు. ‘‘ఇండియా ఫెయిల్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. భారత్ తన మీదికి రావడం చంద్రుడికి కూడా ఇష్టం లేదని మీమ్స్‌తో ట్వీట్లు చేస్తున్నారు. వీటికి భారత నెటిజన్లు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. ‘‘మేము అంతవరకు అయినా వెళ్లగలిగాం. మిమ్మల్ని కనీసం పక్క దేశాలు కూడా వారి భూభాగంలో అడుగుపెట్టనియ్యవు. ప్రతి విషయానికి దాయాది దేశం మీద పడి ఏడవటం మానుకోవాలని’’ అంటూ గట్టిగా హెచ్చరించారు.

Tags: chandrayan2 pakistan sattires isro modi tweets

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top