logo

ఇచ్చట 5లక్షలకే వేలిముద్రలు మార్చబడును..!


07-Sep-2019 15:09IST
west godavari police arrested fake finger prints gang

నేటి సాంకేతికత ప్రపంచంలో ఎటువంటి క్రైమ్ కు పాల్పడినా క్షణాల్లో దొరికిపోవాల్సిందే. గతంలో నేరం చేసిన వ్యక్తి ముఖానికి మేకప్ వేసుకున్న గుర్తుపట్టడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఫేస్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీస్, ఐరిష్, ఫింగర్ ప్రింట్స్ అంటూ పలురకాల సాంకేతిక పరీక్షల ద్వారా నేరం చేసిన వ్యక్తిని సులువుగా పట్టేస్తున్నారు. అయితే, నేరం చేసిన వ్యక్తి ఎదోకరకంగా అన్ని దశలను అధిగమించినా... చివరకు ఫింగర్ ప్రింట్ దగ్గర మాత్రం బుక్కవాల్సిందే. 

అయితే ఇప్పుడు ఆ వేలిముద్ర పరీక్ష దశను కూడా అధిగమించే కొత్త మార్గాన్ని కనుగొన్నారు... కొందరు ముఠా సభ్యులు. వీరు ఏకంగా చేతి వేళ్లపై ముద్రలనే తారుమారు చేసి చూపిస్తున్నారు. ఐదుగురు సభ్యులన్న ఈ ముఠా.. చేతి వేళ్లపై ఉన్న చర్మాన్ని లోతుగా కోయడం, సర్జరీ చెయ్యడం, కొత్త వేలిముద్రలు సృష్టించడం ద్వారా, నకిలీ ఆధార్‌, పాస్‌పోర్ట్‌లు సంపాదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరు అంతర్జాతీయ వ్యవస్థలను సైతం బోల్తా కొట్టించి.. కొత్తరకం క్రైమ్‌కి తెరలేపుతున్నారు. 

ఇలా, నకిలీ ఆధార్, పాస్ పోర్ట్ లను సృష్టించి దాదాపు 70 మందిని విదేశాలకు పంపించారు. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దర్వాప్తు జరిపి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాగా, ఇలా దొడ్డిదారిన విదేశాలకు వెళ్లిన వారు ఏ రకమైన క్రైమ్‌కి పాల్పడుతున్నారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం బుగ్గేశ్వరానికి చెందిన రాంబాబు... మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, ముజఫర్‌ లతో ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారమంతా నడుపుతున్నాడు.  వీరికి ఆర్‌ఎంపీ వైద్యుడు వీరా త్రిమూర్తులు, కోడెంరెడ్డి రాజిరెడ్డి, షేక్ మహ్మద్ సహా శ్రీలంకకు చెందిన జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తులు సహకరిస్తున్నారు. 

Tags: fake finger prints west godavari police rambabu fake passports

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top