logo

మనస్తాపంతో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య


07-Sep-2019 16:51IST
village volunteer suicide in west godavari

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతీ మనస్తాపంతో ఆత్మాహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచి వేసింది. వివరాల్లోకెళితే...స్థానిక జిల్లా పోలవరం నియోజక వర్గంలోని జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంకు చెందిన పండు నవీన అనే యువతి ఇటీవలే గ్రామ వాలంటీర్ గా నియమితురాలయ్యింది. ఈ క్రమంలో ఓ మహిళా తన ఆధార్ కార్డు ఆన్లైన్ తప్పిదాలకు తనను బాధ్యురాలిని చేస్తూ ఆధార్ ఎందుకు ఆన్లైన్ చెయ్యలేదని దురుసుగా మాట్లాడుతూ వాదానికి దిగింది. ఆమెకు సమాధానం చెప్పలేక అక్కడి నుండి ఇంటికి ఏడుస్తూ వెళ్లి ఆమె తండ్రి శ్రీరామమూర్తికి తెలిపింది. దాంతో ఆయన వారించి పొలం పనులకి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది . 
      

Tags: village volunteer suicide west godavari

Advertisement
Advertisement
Top