logo

ఆర్బిటర్ కాలపరిమితి ఏడున్నరేళ్లకు పెంచుతున్నాం: శివన్


07-Sep-2019 21:55IST
we are increasing the orbiter period to seven and a half years  sivan

భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 నేడు అందరిని నిరాశ పరిచింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్రయాన్ 2 ప్రాజెక్టులో అతి కీలక భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో కి సంకేతాలు అందించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో నేడు ఇస్రో వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో ఇస్రో వర్గాలకు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందంటే..? అది విక్రమ్ ల్యాండర్ ను మోసుకెళ్లిన ఆర్బిటర్. ఇప్పటికి ఆ ఆర్బిటర్ ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ముందుగా నిర్దేశించిన ఆర్బిటర్ కాల పరిమితి ఏడాది మాత్రమే. కానీ అందులో అదనపు ఇంధనం ఉన్న కారణంగా దాని కాలపరిమితిని మరో ఏడున్నరేళ్లకు పెంచుతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ఆర్బిటర్ అందించే సమాచారం కూడా ఎంతో  ఉపయోగ పడుతుందని భావిస్తున్నామని వెల్లడించారు. 

Tags: increasing orbiter period seven and a half years isro chairman sivan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top