logo

మహానగరంలో దారుణం


08-Sep-2019 12:00IST
3 years child murdered in mumbai

కన్న తండ్రి స్నేహితుడే ఆ పసిబిడ్డ పాలిట కాల యముడయ్యాడు. లోకం తెలియని ఆ పసికందుని కాన రాని లోకానికి పంపించాడు. మహానగరం 
ముంబైలోని  కొలాబాలో గల రేడియో క్లబ్ దగ్గర్లో అశోకా అపార్ట్‌మెంట్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. రాత్రి 7గంటల సమయంలో అపార్ట్‌మెంట్ కిందనుండి ఒకే సారి పెద్ద శబ్దం వచ్చింది. దాంతో అపార్ట్‌మెంట్ లో ఉండే వాలంతా కంగారుగా ఏంటాని కిందకి చూడగా రక్తపు మడుగులో, శరీర భాగాలు ముక్కలైపోయి నిర్జీవ స్థితిలో ఉన్న మూడు సంవత్సరాల చిన్నారిని చూసి తీవ్ర ఆవేదన చెందారు . 

ఒకరు ఆ చిన్నారి ఏడో అంతస్థులో ఉండే షనాయా అని గుర్తించారు. ఆ పాప కిటికీ లోంచీ కింద పడిందని వాళ్లకు అర్థమైంది. అలాగే మూడేళ్ల పాప  అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు మొత్తం అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. లోపలున్నవాళ్లెవరూ బయటకు వెళ్లనివ్వకుండా బయట వాళ్ళు లోపలి రాకుండా అన్ని మూసివేశారు. అనంతరం పోలీసులకు తెలుపగా.. విషయం తెలుసుకున్న పోలీసుల వెంటనే ఘటన స్ధలానికి వచ్చి పరిశీలించారు.  

షయానా తండ్రికి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ ఏడో అంతస్థులో ఆడుకుంటున్న పాపను బలవంతంగా ఎత్తుకొని కిటికీ లోంచీ కిందకు విసిరేశాడని అర్థమైంది. ఆ సమయంలో షయానా మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఏం పాపం చేసిందని ఆ చిట్టితల్లిని అంత క్రూరంగా విసిరేశాడన్నది తెలియలేదు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యప్తు చేస్తున్నారు. ఆ పాపను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

Tags: 3 years child murdered mumbai

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top