logo

విక్రమ్ లాండర్ ఆచూకీ తెలిసింది: ఇస్రో చీఫ్ కె.శివన్


08-Sep-2019 15:41IST
isro found the location of vikram lander

భారతదేశంలోని ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రోపొందించింన చంద్రయాన్ 2 ప్రయోగంలో కనిపించకుండా పోయిన విక్రమ్ లాండర్‌ ఆచూకీ దొరికినట్లు ఇస్రో వెల్లడించింది. నిన్న తెల్లవారు జామున 1.40 గంటల సమయంలో చంద్రుడి మీద సాఫ్ట్ లాండింగ్ అవుతున్న ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. 

అప్పటి నుండి విక్రమ్ లాండర్ ఎక్కడికి వెళ్ళిందో ..? ఏమైపోయిందో..? ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ కనిపింక్గ్గకుండా పోయిన విక్రమ్ లాండర్ ని గుర్తించింది. అలాగే చంద్రుడి ఉపరితలంపై ఉన్నట్లు థర్మల్ చిత్రాలను తీసినట్టు స్వయంగా ఇస్రో చీఫ్ కె.శివన్ ప్రకటించారు. అయితే విక్రమ లాండర్ తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. త్వరలోనే లాండర్ కి ఇస్రోకి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ కె.శివన్ ఆశ భావాన్ని వ్యక్తం చేసాడు. 

Image result for vikram lander

Tags: isro found the location vikram lander moon surface

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top