logo

మండపంలో వినాయకుడితో పాటు ఎమ్మెల్యే విగ్రహం


08-Sep-2019 18:16IST
The statue of lord ganesha along with trs mla statue

గత కొద్దీ రోజుల నుండి గణేష్ ఉత్సవాలతో ప్రతి ఊరు సందడిగా మారింది. గల్లీకోక రకమైన విగ్రహాలతో అందరిని ఆకట్టుకునేలా ఉత్సవాలు మారాయి. కానీ ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన వినాయకమండపంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం వివాదాస్పదంగా మారింది. అంతే కాకుండా వినాయకుడి విగ్రహానితో పాటుగా తన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిసి గణేష్ విగ్రహాన్ని సందర్శించిన జీవన్ రెడ్డి ఫొటో కూడా దిగారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన జీవన్ రెడ్డి ఫొటో వినాయకుడి మండపంలో పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే తాజాగా యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, హరితహారం, కేసీఆర్ కిట్ వంటి పథకాలను చెక్కడంతో తెలంగాణలో శిల్పాల వివాదం తలెత్తుతోంది. 

వాటితోపాటు సైకిల్, కమలం, గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి మరికొన్ని రాజకీయ చిత్రాలు ఉన్నా కూడా కేసీఆర్ ఫొటోల మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేవలం దైవ సంబంధిత చిత్రాలు మాత్రమే చెక్కించాలని, సీఎం కేసీఆర్ కానీ, ఇతరత్రా రాజకీయ చిహ్నాలు వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భాస్కర్ రెడ్డి యాదాద్రి ఆలయ అభివృద్ధి అధారిటీని ఆదేశించారు.

Tags: lord ganesha mandapam trs mla statue nijamabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top