logo

ఏపీ గ్రామ సచివాలయం రిజల్ట్స్ ఎప్పుడంటే..?


09-Sep-2019 10:51IST
ap grama sachivalayam results will be released on this date

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేస్తున్న కార్యక్రమం ఏపీ గ్రామ సచివాలయం. రాష్ట్రంలో అవినీతి అనేదే లేకుండా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఈ గ్రామ వార్డ్ సచ్చివాలయానికి తెరతీశారు. ఈ గ్రామ/వార్డ్ సచివాలయంలో మీరు ఇచ్చిన ఏ ఫిర్యాదునైనా కూడా కేవలం 48 గంటల్లోనే పరిష్కారించేలా సన్నద్ధం చేస్తున్నారు. 

అలాగే ప్రతి పంచాయతీకి 10 మందికి ఇందులో ఉద్యోగాలు ఇస్తూ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల సంఖ్యని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 1,26,728 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వదలగా ..రాష్ట్రంలోని సుమారు 22 లక్షలమంది ఈ గ్రామ/ వార్డ్ సచ్చివాలయం ఎగ్జామ్స్ కి అప్లై చేసుకున్నారు. ఇకపోతే  ఏపీలో గ్రామ సచివాలయాల్లో ఈ  ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించారు. 
Image result for ఏపీ గ్రామ సచివాలయం రిజల్ట్స్ ఎప్పుడంటే..?
ఈ పరీక్షలకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబరు 20న వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని కూడా నాగార్జున యూనివర్సిటీలో స్కానింగ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే సగానికిపైగా పేపర్స్ స్కానింగ్ అయిపోయినట్టు సమాచారం. దీనితో కచ్చితంగా ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ నెల  20న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Tags: Grama Sachivalayam Results Grama Sachivalayam Exam Results 2019

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top